Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్టూనిస్టు, చేతిరాత నిపుణుడు పల్లె మణిబాబు
నవతెలంగాణ-సూర్యాపేట
అందంగా రాయడం వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని కార్టూనిస్ట్ , చేతి రాతనిపుణుడు పల్లె మణిబాబు అన్నారు.ఆదివారం స్థానిక బాలభవన్‌లో బాలలకు చేతిరాత మెళకువలపై నిర్వహించిన శిక్షణాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్య, విజ్ఞానం సముపార్జనలో ముఖ్య పాత్ర చేతిరాతదన్నారు.అక్షరాలు సరైన విధంగా వ్రాయు పద్ధతి గురించి అవగాహన కల్పించడం ద్వారా వేసవి శిక్షణ క్యాంపుకు హాజరయ్యే బాల బాలికలకు చాలా ప్రయోజనం చేకూరుతుందని బాలభవన్ నిర్వాహ కులను అభినందించారు.ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న తమ పిల్లల అదష్టం బాలభవన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమాలని పేర్కొన్నారు. పిల్లల మానసికవికాసం, ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమన్నారు. అనంతరం బాల్భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకష్ణారెడ్డి, సిబ్బంది, పేరెంట్స్ కలిసి మణిబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల భవన్ సిబ్బంది దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణసింగ్, అనిల్, సాయి, వీరునాయుడు, పద్మ, సునీత, పేరెంట్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.