Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
గత పల్లె ప్రగతిలో చేసిన పనులకు నిధులు చెల్లించకుండా తిరిగి జూన్ నుండి ఐదో విడత పని చేయమంటే అలా అని నల్గొండ ఎంపీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ అన్న భరోసాయాత్రలో భాగంగా ఆదివారం బక్కమంతులగుడెం, చౌటపల్లి, పెదవీడు, మఠంపల్లి గ్రామాల్లో జరిగిన సభలలో మాట్లాడారు. ఈ సందర్భంగా బక్కమంతులగుడెంలో విలేక రులతో మాట్లాడుతూ ప్రభుత్వం సర్పంచులు, ఇతర ప్రజాప్ర తినిధులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండానే తిరిగి పనులు చేయాలంటే సరైంది కాదని, ప్రజాప్రతినిధుల రక్తం పిలుస్తు న్నారని, వారు అప్పులు చేసి ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానన్నారు. బిల్లులు చెల్లించే వరకు పనులు చేయరని, అవసరమైతే ప్రజాప్రాతినిధుల పక్షాన పోరాటం చేస్తానన్నారు. ఎమ్మెల్యే బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారని, ఎల్ఈడీ బల్బు లు, ట్రాక్టర్లు, బ్లీచింగ్ పౌడర్‌కు కూడా అతను చెప్పిన కాంట్రాక్ట్ వద్ద కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందులోను పదిశాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెసులో ఉంటే కేసులు టీఆర్ఎస్ లోకివెళితే లేకుండా చేస్తున్నారని, అందుకు నిదర్శనమే తాను స్వయంగా హుజూర్నగర్ సీఐకి ఓ కేసు విషయంలో ఫోన్ చేయగా ఈ కేసులో ఎటువంటి సాయం చేయలేనని చెప్పాడని తెలిపారు. ఆ విషయం విన్న బాధితుడు టీఆర్ఎస్లో చేరగానే కేసులేకుండా చేశాడన్నారు. ఇది సరైంది కాదని పోలీసు వ్యవస్థ అధికార పార్టీ జాగీరుకాదని, ఇప్పటికైనా పోలీసులు న్యాయంగా వ్యవహరించకపోతే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని హెచ్చరించారు. అరాచకశక్తులకు, దొంగలముఠాకు ఎవరు భయపడవద్దని ఏ ఒక్క కార్యకర్తకు ఆపదవచ్చినా మండల పార్టీ అంతా కదిలి వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున కదిలివచ్చి కోలాట, డబ్బులతో స్వాగతం పలికారు. చౌటపల్లి, మఠంపల్లి లో పలువురు టీఆర్ఎస్కు రాజీనామా చేసి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయా సభలలో మండల పార్టీ అధ్యక్షుడు భూక్య మంజునాయక్, సీనియర్ నాయకులు సాములశివారెడ్డి, ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి, దావత్ నవీన్ నాయక్, బచ్చలకూరి బాబు, సింగారపు సైదులు, గంగసాని ఎల్లారెడ్డి, గోవిందరెడ్డి, రామి రెడ్డి, వెంకటరెడ్డి, నిజాం, మహేష్ గౌడ్, ఎలియాస్ రెడ్డి, పీఏసీిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, వైస్ చైర్మన్ బాబు, తన్నీరు మల్లికార్జున్, వంటిపులి శ్రీనివాస్, ఆదూరి మధుసూదన్ రెడ్డి, జయభారత్ రెడ్డి, కుమార్, చిలక గురవయ్య, కరీం, ఎం.ఎం యాదవ్, సామల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.