Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి...ఇద్దరికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వనమాల శివయ్య, వనమాల పున్నారావు, కస్తాల తిరపయ్య, మెట్టు సీతయ్య, ఎస్కే. మస్తాన్, మేట్టు నాంచారయ్య ధాన్యం కాటాకు వెళ్లి ట్రాక్టర్ లోడ్ చేసుకుని తిరిగి కూచిపూడి గ్రామంలోకి వస్తున్న క్రమంలో డ్రైవర్ శీలం హరిబాబు అతి వేగంగా జాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను తప్పించబోయి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టడంతో ట్రాక్టర్ ఇంజన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వనమాల శివయ్య, వనమాల పున్నారావు, కస్తాల తిరపయ్యకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తున్న క్రమంలో మార్గమధ్యలో వనమాల శివయ్య (55) సంవత్సరాలు మృతి చెందాడు. వనమాల పున్నారావు, కస్తాల తిరపయ్యకు సీరియస్‌గా ఉండడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శివయ్య కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.