Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ వారి హక్కుల రక్షణకు కృషి చేస్తున్న సీఐటీయూ 52 ఏండ్ల (1970 మే 30) కింద కార్మికుల ఐక్యత, పోరాటాలు నినాదం పేరుతో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు అనేక కార్మిక ఉద్యమాలు నిర్వహించి, కార్మిక, కర్షకులకు ఎన్నో విజయాలు సాధించి పెట్టింది.భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకునే దిశగా సిఐటీయూ పోరుబాట సాగిస్తుంది.
కార్మికులకు అండ సీఐటీయూ జెండా
సీఐటీయూ యాదాద్రిభువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు
సంఘుటిత, అసంఘుటిత రంగంలో పనిచేసే కార్మికులకు అండసీఐటీయూ జెండా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అధికంగా పరిశ్రమలు ఉన్న జిల్లా యాదాద్రి భువనగిరి.ఇక్కడ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు లేవు, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించ లేదు.కాలుష్యం కోరల్లో ఈ ప్రాంతం పూర్తిగా నిండిపోయింది. వీటిన్నింటికి పరిష్కారం చూపాలని అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని విజయాలు సాధించినప్పటికి, మిగతా వాటికోసం ఉద్యమాలు కొనసాగిస్తున్నాం.ఐకేపీ, ఇతర హమాలీ కార్మికులు పనిచేస్తున్న చోట కనీస వసతులు కల్పించాలని, వారికి ఇన్సురెన్సూ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ కార్యలయాల ముందు ధర్నాలు, నిరసనలు తెలిపార. కనీస వసతులు కల్పనలో పరిస్థితి మెరుగైంది. మున్సిపల్, అంగన్వాడీ వర్కర్లకు 30శాతం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించాం.దాని ఫలితంగా విజయాలు కూడా సాధించాం. గ్రామపంచాయితీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాం.అంతేగాకుండా కార్మికులపై అధికారులు, గ్రామ కార్యదర్శుల వేధింపులను వెంటనే నియంత్రించాలని జిల్లా అధికారులపై ఒత్తిడి చేసే కార్యక్రమాలు నిర్వహించాం.వేధింపుల వల్ల తొలగించిన కార్మికులకు పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశాం.
పౌరహక్కులు, కార్మిక, కర్ష పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలి
సీఐటీయూ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ఐక్యత, సమగ్రత, దేశ ఆస్తుల రక్షణ, పౌరహక్కులు, కార్మిక, కర్షక పోరాటాలతో పాటుగా సామాజిక పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలి.మే 30 సీఐటీయూ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక, ఉద్యోగ,రైతులు, ప్రజలు ప్రతిన భూనాల్సిన అవసరం ఉంది. దేశంలో మతిచిచ్చుతో హిందు, ముస్లీంల మద్య చిచ్చుపెడుతూ దేశ ప్రజల మద్య చీలికలు కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దేశ సంపదను ఆస్తులను కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతుంది. ప్రజలపై ధరల ప్రభావం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా నష్టం చేస్తుంది. ప్రజలను ఐక్యం చేసి సామాజిక ఉద్యమాలను నిర్మించడంలో సీఐటీయూ పనిచేస్తుంది. భవిష్యత్‌లో కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి దేశం లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలి.దేశవ్యాప్తంగా మార్చి 28న జరిగిన కార్మిక సమ్మెలో సుమారు 23కోట్ల మంది పాల్గొనడం బీజేపీకి చెంప పెట్టుగా జరిగింది.
ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన సిఐటీయూ
సీఐటీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిరావు
ఐక్యత పోరాటం నినాదంతో 1970 లో ఏర్పడిన సీఐటీయూ నాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షపాతిగా పనిచ ేస్తుంది.కార్మికుల దైనందిన సమస్యలతో పాటుగా సమస్యలకు మూలమైన పాలక వర్గాల స్వభావాన్ని కార్మికులకు ఎప్పటికపుడు గుర్తుచేస్తూ సమ రశీల పోరాటాలను నిర్వ హిస్తుంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో , సూర్యపేట జిల్లాలో గాని కార్మికుల పోరాటాలకు నాయకత్వం వహిస్తూ వారిని ఐక్యం చేయడంలో సీఐటీయూ అగ్రభాగంలో ఉంది.జిల్లాలో ఉన్న సిమెంట్ పరిశ్రమలలో పర్మినెంట్, దినసరి కార్మికుల పక్షాన పోరాడి వారికి రిటైర్డు అయిన కార్మికులకు బెనిఫిట్స్, ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు పరిహారం ఇప్పించాం. షేడ్యూల్డ్ పరిశ్రమలలో కనీసవేతనాల సవరణ కోసం ఉద్యమాలు నిర్వహించి సూర్యాపేట,కోదాడ, హుజూర్ర్నగర్ ప్రాంతాలలో వేతన ఒప్పందాలు చేయించారు.అసంఘుటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు చట్టప్రకారం వారి హక్కులను కాపాడుతూ భవననిర్మాణ రంగంలో కార్మికులకు వేల్ఫేరు బోర్డు కార్డులు ఇప్పించారు.గ్రామీణ, మార్కెట్, మిల్లు హమాలీ కార్మికు లకు మెరుగైన వేతనాల కోసం ఒప్పందాలు చేస్తున్నాం. కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అండగా ఉంటూ వారికి నిత్యా వసర సరుకులు పంపిణీ చేశాం.కోదాడ మండలంలోని పోరస్ లాటరేటరీలో జరిగిన గుర్తింపు ఎన్నికలలో సీిఐటీయూ విజయం సాధించింది.జిల్లాలో కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలకు దూరంగానే ఉన్నారు. స్కీమ్ వర్కర్లని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు కోసం సంఘుటిత ఉద్యమాలు సాగించి పాలకులపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. ట్రాన్స్‌ఫోర్టు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పనిభద్రత లేదు. యాజమాన్యాల ఒత్తిడి ఎక్కువైంది.ప్రభుత్వం, కార్మిక శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.భవిష్యత్‌లో కార్మికులను ఐక్యం చేసి వారి పక్షాన పోరాడి ఐక్య ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతిన బూనాలి.