Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూపరింటెండెంట్‌ను వెంటనే నియమించాలి
- పనిభారంతో సతమతమవుతున్న సిబ్బంది
నవతెలంగాణ-పాలకవీడు
పరిపాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబర్‌లో కొత్తగా పురుడుపోసుకున్న పాలకవీడు మండలంలోని మండలపరిషత్ కార్యాలయంలో సిబ్బంది కొరతవేధిస్తుంది.మండలకేంద్రంలో ప్రజలకు సేవలు అందించడంలో వెన్నెముకగా పనిచేసే.. మండల పరిషత్ కార్యాలయంలో సరిపోను సిబ్బంది లేకపోవడంతో.. ప్రస్తుతం ఉన్న వారు పనిభారంతో సతమతమవుతున్నారు.వివిధ రకాల ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయానికి వచ్చి నిరాశగా వినుదిరుగుతున్నారు.ఎంపీడీఓ తర్వాత గురుతర బాధ్యతను కార్యాలయంలో నిర్వహించే.. సూపరిం టెండెంట్ పోస్టు మండలం ఇంకా నోచుకోలేదు. ఎంపీడీవో లేని సమయంలో ప్రజలకు సమాధానం చెప్పే అధికారి కార్యాలయంలో కరువయ్యారు. మండలంలో 6 ఏండ్ల నుండి ఈ పోస్టు ఖాళీ ఉండడంపై.. ప్రజాప్రతినిధులను, ప్రాంత వాసులను విస్మయానికి గురిచేస్తుంది.
మండలంలో 22 గ్రామ పంచాయతీలు, ఐదు ఆవాస గ్రామాలు కలిపి..21,000 వేలకు పైగా ఉపాధికూలీలు ఉన్నారు.వారికి సేవలందించడంలో కీలకంగా ఉండే టెక్నికల్ అసిస్టెంట్లు.. ముగ్గురు అవసరం కాగా కేవలం ఒకే ఒక్కరు పని చేస్తున్నారు. ఉపాధిపనులకు కొలతలు వేయడం, బిల్లులు చేయడం వంటి పనులు.. వీరికి తలకు మించిన భారంగా మారాయి.ఏపీవో సైతం ఇన్చార్జే కొనసాగుతున్నారు. జిల్లా అధికారులకు, కార్యాలయం నుంచి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా, ఫోన్ ద్వారా విన్నవించుకున్నా.. సిబ్బందిని సర్దుబాటు చేయలేక పోతున్నారని.. పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మార్చి చివరి వారం నుండి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి.87 వేల పనిదినాలు సుమారుగా పూర్తయ్యాయి.ఇంకా పనులు చేయాల్సినవి మిగిలి ఉన్నాయి. పనులు చేసిన కూలీలకు పూర్తిస్థాయిలో కూలి డబ్బులు అందలేదు.ఒక్కరే టెక్నికల్అసిస్టెంట్ విధులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది.కొత్తగా ఏర్పడిన మండలంలో ఎక్కువ కాలం ఎంపీడీఓగా విధులు నిర్వహించిన జానయ్య సుదీర్ఘ కాలం సెలవులో ఉండడంతో ఇన్చార్జి ఎంపీడీఓగా వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి పూర్తిస్థాయి బాధ్యతలో కొనసాగుతున్నారు.ఉపాధిహామీ పనుల పరిశీలన, క్రీడా ప్రాంగణాల నిర్మాణం,స్థల పరిశీలన కోసం, ఆయన మండల రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామాలను సందర్శిస్తున్నారు.ఈ సమయంలో కార్యాలయానికి వివిధ రకాలపనులకు వచ్చిన ప్రజలకు సమాధానం చెప్పే సూపరింటెండెంట్ లేకపోవడం ప్రధాన కొరతగా ఉంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో కార్యాలయానికి సిబ్బందిని కేటాయించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలం దించాలని మండలంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.