Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పాలకులు
- మూసీ నీటి నుండి యాదాద్రి జిల్లాకు విముక్తి కల్పించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-రామన్నపేట
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రాంతవాసులకు మూసీ విషజలాల నుంచి విముక్తి కల్పించి, ప్రత్యామ్నాయంగా కృష్ణా, గోదావరి జలాలు అందించి, సాగు, తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్ డిమాండ్ చేశారు.మండలంలోని వెల్లంకి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ పరివాహకప్రాంతం కావడంతో ప్రమాదకరమైన విషతుల్య జలాలతో ప్రజలు అనేక రకాలైన రోగాల బారిన పడుతున్నారన్నారు.పశుపక్ష్యాదులు, జల జీవచరాల ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.మూసీనీటితో పంటలు పండించడంతో తినే ఆహారంలో, పశుగ్రాసంలో, చేపల్లో కెమికల్స్ చేరి ప్రజల ఆరోగ్యాలను ప్రశ్నార్థకం చేస్తున్నా యన్నారు.వెంటనే ప్రజల ఆరోగ్యాలను దష్టిలో పెట్టుకుని నీటివనరుల నిపుణులతో సర్వే చేయించి ప్రత్యామ్యాయంగా కష్ణా, గోదావరి జలాలు అందివ్వాలని డిమాండ్ చేశారు.బస్వాపురం, నసింహా ప్రాజెక్టు ద్వారా, వడపర్తి కత్వ ద్వారా భువనగిరి, బీబినగర్, వలిగొండ, రామన్నపేట, ఆత్మకూర్ తదితర మండలాలకు నీరందివ్వవచ్చాన్నారు.గోకారం నుండి సంగెం ద్వారా అసీఫ్నహర్ కాల్వకు, బునాదిగాని కాల్వ ద్వారా మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు కాలేశ్వరం నీటీని మళ్లించొచ్చన్నారు.డిండి ప్రాజెక్టు ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండల గ్రామాలకు కష్ణా నీటిని అందించాలని డిమాండ్ చేశారు.జల కాలుష్య బోర్డు అనేక ల్యాబ్లు మూసీ నీరు ప్రమాదమని హెచ్చరించినా ప్రభుత్వాలు చొరవచూపడంలేదని విమర్శి ంచారు.మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే నిర్వహించి ప్రభుత్వం బాద్యత వహించాలన్నారు.పార్టీ ఆద్వర్యంలో మూసీ ప్రక్షాలనకై, తాగు, సాగు నీరు ప్రత్యామ్నాయ జలాలకై జిల్లావ్యాప్తంగా జూన్ మాసంలో పోరాటం నిర్వహించనున్నామన్నారు.ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండలకార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనంఉపేందర్, శాఖ కార్యదర్శి ఆవనగంటి నాగేష్, కర్రె సంతోష్, కరకంటి మల్లయ్య, ఆవనగంటి లక్ష్మయ్య, ఆవనగంటి మల్లేష్, తాటిపాముల నరేష్, నకిరెకంటి మహేష్, గుర్రం మహేష్, బండ్ల పవణ్ తదితరులు పాల్గొన్నారు.