Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
యువత రాజ్యాంగ నిర్మాత బాబా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని ఉమ్మడి రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం మండలపరిధిలోని రాఘవాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కోరిపల్లి వినరు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.దేశంలో రాష్ట్రంలో కుల,మత వ్యవస్థ వెళ్లు నాటుకపోయాయన్నారు.వాటిని సమాజం నుండి వేరు చేసినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు జ్యోతిరావు ఫూలే, బాబుజగ్జీవన్‌రావు విగ్రహాలను ఏర్పాటు చేస్తే ముక్తి కలుగుతుందన్నారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పుణ్యంతోనే నేడు రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమస్ఫూర్తితో స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, గుండె వ్యాధిగ్రస్తులతో పాటు మరికొన్ని రోగాలకు సంబంధించి ప్రయివేట్ ఆస్పత్రులు, ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాధిగ్రస్తులు ఉచిత చికిత్స పొందుతు న్నారన్నారు.టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఎమ్మార్పీఎస్ వర్గీకరణ గురించి చెవిటి వాని ముందు శంఖం ఊదిన మాదిరిగా ఉందని విమర్శించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నాయకులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండాల గంగులు, ఉపసర్పంచ్ రేణుక, నాయకులు వంగాల కిరణ్‌గౌడ్, చింతలపాటి రాములు, రాజన్నమాదిగ, ఎంఈఓ గోపాల్‌రావు,పజ్జూరి భిక్షం, కట్ట ఎల్లారెడ్డి,భయ్యా మల్లయ్య స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీను,డీలర్ లింగయ్య, కోరిపల్లి కిన్నెర, కంపాటి కులస్తులు పాల్గొన్నారు.