Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజానికి ఆయన చేసిన సేవలు సదా చిరస్మరణీయం
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
సూర్యాపేట వైద్యరంగంలో డాక్టర్ మర్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక ముద్ర వేశారని, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.ఆదివారం స్థానిక ఐఎంఏ ఫంక్షన్హాల్లో మర్రి లక్ష్మారెడ్డి ద్వితీయ వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.1977లో ప్రభుత్వాస్పత్రిలో వైద్యుడిగా పనిచేసిన ఆయన రిటైర్ అయ్యే వరకు అక్కడే పనిచేశారన్నారు.ఐఎంఎఫ్ ట్రస్టును ఏర్పాటు చేసి వైద్యుల కుటుంబాన్ని సమైక్యపర్చారని గుర్తుచేశారు.రాజ బహుదూర్ వెంకట్రామిరెడ్డి బాలికల వసతి గహనిర్మాణంలో ఆయన అగ్రగామిగా నిలిచారన్నారు. సుధాబ్యాంక్ చైర్మెన్‌గా సేవలందించిన ఫ్రెండ్స్ ఫోరం ద్వారా వైజ్ఞానిక కార్యక్రమాలు నిర్వహించారన్నారు.తన వైద్యవత్తిలో ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడి నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు.మర్రి లక్ష్మారెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కషి చేయాలని అదే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు మర్రి శోభారెడ్డి,వైద్యులు మర్రి రాజేందర్‌రెడ్డి, శ్రీనిధి, జి.సుస్మితారెడ్డి, జి.మదన్‌మోహన్‌రెడ్డి, నేహా, అవని,అనురాగ్,ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డి, డాక్టర్లు దుర్గాబారు, సుబ్రహ్మణ్యం, మిన్న శివరామకష్ణ, విజయలక్ష్మి, చిలుముల సునీల్‌రెడ్డి, ముద్ద భిక్షపతి, నల్లపాటి అప్పారావు, ఆర్బీవీఆర్ హాస్టల్ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మోదుగు నర్సిరెడ్డి,సభ్యులు తదితరులు పాల్గొన్నారు.