Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరిలో నేడు ఏఆర్గార్డెన్లో జరిగే గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌస్నగర్లో ఆదివారం మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు.సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకాన్ని నగదుబదిలీ పథకంగా మార్పు చేయాలని కోరారు.50 ఏండ్లు దాటిన వారందరికీ వద్ధాప్య పెన్షన్ నెలకు రూ.5 వేలివ్వాలని డిమాండ్ చేశారు. గొర్రెలను మేపుకుంటూ చనిపోతే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు.ప్రభుత్వ భూములను గొర్రెల మేకలపెంపకం దారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రతి గ్రామంలో గొర్రెలకాపరులు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మీటింగ్హాల్ నిర్మించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలకార్యదర్శి పాకజహంగీర్, సొసైటీ నాయకులు భూషబోయిన రామకష్ణ, భూషబోయిన సిద్ధులు, పాకచంద్రమౌళి, పాకపెద్ద శంకర్, పాక రాములు, భూశబోయిన వీరయ్య, పాకనర్సింహ, భూశబోయిన పాండు, పాక లక్ష్మినారాయణ, పాకమహేష్, పాకరాజు, మహేష్, భిక్షపతి, పాక వెంకటేష్ పాల్గొన్నారు.