Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు
నవతెలంగాణ-మోత్కూరు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని, రైతులు పార్టీకి అండగా నిలవాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు కోరారు. కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని పాటిమట్ల, సదర్మాపురం, దాచారం గ్రామాల్లో రైతులతో ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు.పార్టీ జెండాలను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, ఉచితవిద్యుత్తో పాటు ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు.రాహుల్‌గాంధీ నాయకత్వంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించారన్నారు.రుణమాఫీతో పాటు ధరణిపోర్టల్ రద్దు, కౌలురైతులకు రూ.12 వేల సాయం, ఉపాధిహామీ వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు.ప్రభుత్వం అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయడం లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇసుక మాఫియా, కమిషన్ల కోసం తప్ప అభివద్ధి చేయడం లేదని విమర్శించారు.మాజీ మంత్రి దామోదర్ రెడ్డి హయాంలోనే ఎస్సారెస్పీ కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇచ్చామన్నారు.పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలపద్మ, రాష్ట్ర నాయకుడు కంచర్ల యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు నాయిని ప్రవీణ్ కుమార్, నాయకులు చిరుమర్తి యాదయ్య, విజరురెడ్డి, రాములు, పల్లెర్ల భాస్కర్, పానగల్లు రవి, కారుపోతుల శ్రీను, లెంకల వేణు, ఎర్రవెల్లి యాదయ్య, మందుల సురేష్, కారుపోతుల వెంకన్న, బోనగిరి సతీష్, రాచకొండ బాలరాజు, గుండు శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, బందెల రవి తదితరులు పాల్గొన్నారు.