Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల :ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టి సీఎం కేసీఆర్ తెలంగాణను తాకట్టు పెడుతున్నాడని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు.5వ రోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్, రామన్నగూడెం, ఆత్మకూరు ఎస్ గ్రామాలలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించడంతో పాటు సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లా డుతూ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేశాడని, ఇంటికోక్క ఉద్యోగం ఇస్తానని వాటి ఊసే లేదని,ప్రతిపేదవానికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు.కాంగ్రెస్ అధికారం లోకి వస్తే నెలరోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీపై సంతకం చేస్తామన్నారు.కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేల రైతుబంధు ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో చిలుముల గోపాల్‌రెడ్డి, సైదిరెడ్డి, దండ అరవింద్‌రెడ్డి, పేరం లక్ష్మినర్సు, నాగయ్య, గుణగంటి మల్సూర్, ఆవుల సింహాద్రి,ఎల్క సాగర్, వెంకటేష్, రవీందర్,ముదిరెడ్డి రమణారెడ్డి, ప్రవీణ్, షఫీఉల్లా, అబ్దుల్ రహీం,బంటుచొక్కయ్యగౌడ్,రమేష్, భిక్షంనాయక్ పాల్గొన్నారు.