Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండ
గ్రామీణ ప్రాంతాల్లో ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచి రాష్ట్ర సాధనకు పనిచేసిన కళాకారులు అందరిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మండలంలోని టేకులసోమారం గ్రామంలో మేడే ముగింపు ఉత్సవాల సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.సీనియర్ నాయ కులు రేకల లక్ష్మీనారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కళాకారులను సన్మానించారు. అనంతరం గ్రామంలో ప్రజలకు కూరగాయల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాకారులకు పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు కళాకారులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆ గ్రామ శాఖ కార్యదర్శి చేగుర్థి నాగేష్, సర్పంచ్ చేకూరి భిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశం, నాయకులు బొడ్డుపల్లి భిక్షపతి,పీఎన్ఎం జిల్లా కమిటీ సభ్యులు కొమ్ము స్వామి, మండల కమిటీ సభ్యులు రాంచందర్, దుబ్బలింగం, నాయకులు పెద్దబోని భీమరాజు,దండం నర్సిరెడ్డి, నరహరి, నర్సింహ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.