Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-చింతపల్లి
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని మాల్లో 13 మందికి రూ.13 లక్షలను ఆయన కల్యాణ లక్ష్మీ చెక్కులను, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణ లక్ష్మీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొండూరు శ్రీదేవి శ్రీనివాస్, గిర్దావర్ యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, మల్లోజు జగన్ చారి, కొండూరు శ్రీనివాస్,బాదేపల్లి పులిరాజు, బాదేపల్లి నీరంజన్, కుంభం శ్రీశైలం గౌడ్, నాదిరి శ్రీశైలం, మామిడి పరమేష్, కశగోని వెంకటేష్, నేనావత్ సుమన్, ఆకుల శ్రీను, ఉడుతల శ్రీను, కాశగోని యాదయ్య, సిమర్ల శ్రీను యాదవ్, ఆకుతోట నర్సింహ, గడ్డం శేఖర్ గౌడ్, గణగొని అశోక్ గౌడ్ పాల్గొన్నారు.