Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాంపల్లి :మండలంలోని కేతేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ ప్రమాదంలో మరణించిన రాజమోనీ యాదయ్య, పొగాకు వెంకటయ్య కుటుంబాలను మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పరామర్శించి ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల పిల్లల ఉన్నత చదువుల కోసం ఎల్లావేళలా తోడు ఉంటానని హామీ ఇచ్చారు. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నల్గొండ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజమోని వెంకటయ్య కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం కొరకు హైదరాబాదులోని అపోలో హాస్పిటల్‌కు తరలించి కోలుకునే వరకు వైద్యం చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పూల వెంకటయ్య, జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, ప్యాక్స్ చైర్మెన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల నాయకులు పెద్దిరెడ్డి సంజీవ రెడ్డి( రాజు), ఎరెడ్ల సంజీవరెడ్డి, పల్లెటి రామస్వామి, పెరికేటి. జగన్, కాటం వెంకటయ్య, నాంపల్లి సంజీవ, షేక్. చాంద్, దోటి పరమేష్, గదేపాక రాజు, కామిశెట్టి రాజు, కోరే కిషన్, గదేపాక యాలాద్రి, చంద్రరెడ్డి, కోట నర్సింహ, పల్లె రామలింగం, కొమ్ము బిక్షం, గట్ల రాధా శేఖర్‌రెడ్డి, సందీప్, సత్తయ్య, హనుమంతచారి, హరీష్, పాల వెంకటయ్య, దూదిమెట్ల యాదగిరి పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నేతల ఆర్థికసాయం
విద్యుత్ ప్రమాదంలో మరణించిన రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్య మృతదేహాలకు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ నాయకులు కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇరు కుటుంబాలకు కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి చెరో లక్ష రూపాయలు, కర్నాటి విద్యాసాగర్ ఇరు కుటుంబాలకు చెరో లక్షా పది వేల రూపాయలు, కంచర్ల కృష్ణా రెడ్డి ఇరు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో అన్ని విధాలుగా వారి కుటుంబాలను ఆదుకుం టామని, జిల్లా మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీరితో పాటుగా నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వేంకటేశ్వర్ రెడ్డి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు పానగంటి వెంకన్న గౌడ్, మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహ రావు, మండల ఉపాధ్యక్షులు సైదులు గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఎంపీటీసీ బత్తుల వంశీ, దాసరి సాలమ్మ, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు యాదయ్య గౌడ్, కడారి శ్రీశైలం యాదవ్, కొడావత్ లక్ష్మణ్, యూత్ అధ్యక్షుడు బత్తుల విజరు, సర్పంచ్‌లు కోరే హేమలత యాదయ్య, సైదులు యాదయ్య, నగేష్, రమేష్, రేవల్లి సుధాకర్, చెన్న య్య, సర్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
విద్యుత్ ప్రమాదంలో మరణించిన రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్య మృతదేహాలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మునుగోడు ఇంఛార్జి గంగిడి మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యం కల్పించారు. కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ ఎరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అధ్య క్షులు బొడ్డుపల్లి శేఖర్, నాయకులు వడిత్య శంకర్ నాయక్, పొగుల వెంకట్ రెడ్డి, దాచేపల్లి నర్సింహ, బొంత వెంకటయ్య, దేపావత్ రవి నాయక్, సింగా రపు గిరి, మంటిపల్లి శ్రీశైలం, పానగంటి మహేష్ , వేలాద్రి, సుధాకర్ రెడ్డి, కాంతా రెడ్డి, దూదిమెట్ల సత్యం, ఉగ్గపల్లి యాదయ్య, వడిత్య భాస్కర్ నాయక్, లక్మయ్య, సతీష్ పాల్గొన్నారు.