Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోతే
సూర్యాపేట కలెక్టరేట్లో ప్రజావాణిలో ఇచ్చిన వాగు మార్గం ఆక్రమణకు మూడు వారాలు దాటినా అతిగతి లేదని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో రెండుసార్లు దళితులు తమ చేలకు వెళ్లే దారి అక్రమ గురైందని మండల పరిధిలోని రాఘవ పురం గ్రామానికి చెందిన దళితుల తోపాటు ఇతర కులస్తులు ఈ నెల 2వన అదనపు కలెక్టర్ కు మే 16న కలెక్టర్కు ప్రజావాణిలో వాగు మార్గంలో రైతులు వెళ్లే మార్గం సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు, ఇప్పటికి మూడు వారాలు దాటుతున్నా వానాకాలం సమీపిస్తున్న సమస్య పరిష్కరించడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇదే మార్గంలో అగ్రకులానికి చెందిన ఒకరిద్దరు వాగు మార్గంలో బోర్లు వేసుకుని సమస్యలు సష్టించారని తెలిపారు. 12 ఫీట్లు ఉన్న మార్గాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమన వలన 20 మంది రైతులకు దారి లేకుండా అయిపోయిందని పేర్కొంటున్నారు. కొంతమంది రైతులు కౌలుకు ,మరికొంత మంది దారిలేక భూములు బీడుగా మారాయని ఆవేదన చెందుతున్నారు. వాగు అక్రమణ వలన రైతుల కష్టాల గురించి వార్తలు రాస్తే అగ్రకులానికి చెందిన అరాచకం రైతు మండల కేంద్రంలో దారికి అడ్డం గా తిరిగి మళ్లీ బోరు దగ్గరికిరా 'మీ' సంగతి చూస్తాను అని బెదిరిస్తున్నాడు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అక్రమన గురించి రెండు విడతలుగా వినతి పత్రం అందించిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో రైతులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. శ్రీరామ సాగర్ జలాలు రావడంతో భూములకు విపరీతమైన రేటు పెరిగిందని దళిత రైతులు చెబుతున్నారు .తమ భూములు కౌలుకు తీసుకుని స్వల్ప రేటుకు కొనుగోలు చేయాలని బెదిరిస్తున్నట్లు తెలుపుతున్నారు ఈ వాగు కింది భాగంలో చుట్టుగుంట చెరువు ఖమ్మం సూర్యాపేట రహదారి మార్గంలో జలసాధన సత్యనారాయణ భూముల పక్కనఉందని చెప్తున్నారు. పై భాగంలో ఉన్న శ్రీరామ్ సాగర్ జలాలు నీటిపారుదల శాఖ అధికారులు తూములు నిర్మించి ఈ వాగులో ఇస్తే భూములు పండే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మండలంలో 10 గ్రామాల రైతుల పశువులు ఈ చెరువులో వచ్చి దాహం తీర్చుకుంటాయని తెలుపుతున్నారు. గతంలో ఈ మార్గంలో ఉపాధి కూలీ పనిచేసి జీవించారు .ఆ పని కూడ చేయకుండా అక్రమ రైతులు అడ్డు తగులుతుందని పేర్కొంటున్నారు. ఆ మార్గంలో రైతులకు 30 ఎకరాల భూమి ఉంటుందని తెలుపుతున్నారు. గతంలో అరకలు బండ్లు ఈ దారి పోయావని చెప్తున్నారు .అక్రమంగా రైతు బెదిరింపుల వల్లే దారి లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.