Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేరేడుచర్ల
తెలంగాణ సాధన కోసం మలిదశ ఉద్యమంలో అన్ని వర్గాలను కలుపుకుని జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసి తెలంగాణ వాణిని ఎలుగెత్తి చాటిన సామాజిక కార్యకర్త టీజేఎస్ జిల్లా అధికార ప్రతినిధి వురిమల్ల రాధాకష్ణ తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. పట్టణానికి చెందిన జన సమితి నాయకులు వురి మల్ల రాధాకష్ణ అనారోగ్యంతో సోమవారం మతి చెందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం రాధా కష్ణ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ సాధనలో ముందుండి పోరాడిన వారు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని నేటి ప్రభుత్వం గుర్తించ క పోవడం దురదష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి ప్రధాన కార్యదర్శి కుంట్ల దర్మర్జున్ రెడ్డి, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొనతం చిన్న వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు, కొదమ గుండ్ల నగేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయ నాయుడు,మాజీ సర్పంచ్ ఆకారపు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి సుందరయ్య, అలనాటి జేఏసీ చైర్మెన్్ నోముల మల్లేశం, సీపీఐ మహిళా కమిటీ నాయకురాలు లక్ష్మి బెల్లంకొండ హరికష్ణ పాల్గొన్నారు.