Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంతాచారి పుట్టిన పొడిచేడు సమగ్రాభివద్ధికి కషి
- తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
నవతెలంగాణ-మోత్కూరు
మూసీనదిలో పొడిచేడు, దాచారం గ్రామాల్లో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో సోమవారం పలు అభివద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలుచేశారు. పేలపూడి బ్రదర్స్ తమ తల్లిదండ్రులు అంతయ్య, అచ్చమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభించి గ్రామస్థులకు వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వథాగా పోతున్న మూసీ జలాలను సాగునీరుగా అందించాలన్న లక్ష్యంతో మూసీనదిలో పొడిచేడు గ్రామంలో రూ.4.70 కోట్లతో, దాచారం గ్రామంలో రూ.5 కోట్లతో లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని, ఇప్పటికే సర్వేతో పాటు ఇతర అన్ని అనుమతు పనులు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే నిధులు మంజూరవుతాయని తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అరుడైన కాసోజు శ్రీకాంతాచారి పుట్టిన పొడిచేడు గ్రామ సమగ్రాభివద్ధికి తన శాయశక్తులా కషి చేస్తానన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి కొత్తగా 7890 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయని, స్వంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందిస్తామని చెప్పారు. దళితబంధు కింద తిరుమలగిరి మండలంలో 2500 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.250 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆరేనన్నారు. పాఠశాలలను అభివద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, తొలుత తెలంగాణ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ పేలపూడి మధుఅధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకష్ణారెడ్డి, జెడ్పీటీసీ గోరుపల్లి శారదనంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, సింగిలిండో చైర్మెన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్చైర్మెన్ పేలపూడి వెంకటేశ్వర్లు, జడ్ఫీ కోఆప్షన్ మెంబర్ గుండిగ జోసెఫ్, ఎంపీటీసీ దీటి సంధ్యారాణి, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కొండా సోంమల్లు, తీపిరెడ్డిమేఘారెడ్డి, ఉపసర్పంచ్ కప్పె వెంకటేశం, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, పట్టణ ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాంపాక నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపన
పొడిచేడు గ్రామంలో రూ.12.6 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, రూ.2.25 లక్షలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకతి వనం, రూ.3 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ, రూ.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించగా, మన ఊరు- మన బడిలో రూ.13.97 లక్షలతో చేపట్టిన ప్రభుత్వ పాఠశాల అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు వెంటనేమంజూరు చేస్తానని, దత్తప్పగూడెం-పొడిచేడు రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరగా త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.