Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతుల రుణమాఫీ ని వెంటనే చేపట్టాలన్నారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు. 57 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న వితంతు పెన్షన్ లను మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఆన్ లైన్ పెట్టాలి వాళ్ళ నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జై శ్రీనివాసాచారి కెసి రెడ్డి యాదవ రెడ్డి కే శ్రీనివాస్ బచ్చన గాని గాలయ్య, ఉప్పల పల్లి బాలకష్ణ, దుబ్బాక భాస్కర్ కలకొండ సంజీవ, జన గల నరసింహ గంగాదేవి బిక్షపతి, బొమ్మని శంకరయ్య తదితరులు ఉన్నారు.