Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
నవ తెలంగాణ-మోత్కూరు
బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఆర్థిక భరోసాగా నిలిచిందని, పేదింటి ఆడబిడ్డలకు ఈ పథకం వరం లాంటిదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకంలో 42 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం, అభివద్ధికి కోసం నిరంతరం కషి చేస్తున్నారని, పేదలు ఆడబిడ్డల వివాహం సందర్భంగా ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్న తపనతో వారికి ఆర్థికంగాచేయూతనిచ్చేందుకు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి తొలుత రూ.50,116తోప్రారంభించారని, దశలవారీగా ఆర్థిక సాయాన్ని పెంచి నేడు రూ.లక్షా 116 అందజేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ మారయ్య, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, సింగిల్ విండో చైర్మెన్కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, తహసీల్దార్ షేక్ అహ్మద్, ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, ఆర్ఐ గాలయ్య తదితరులు పాల్గొన్నారు.