Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని నీర్నెంల గ్రామనికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకులు నోముల రవీందర్ అనారోగ్యంతో మతి చెందడంతో సోమవారం టిపిసిసి కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కోండేటి మల్లయ్య విషయం తెలుసుకొని గ్రామానికి వచ్చి రవీందర్ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రవీందర్ కుటుంబ సభ్యులను కోండేటి మల్లయ్య 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట పట్టణ అధ్యక్షులు ఎండి.జమీరోద్దీన్, మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండి.ఏజాస్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి.మహబూబ్ అలీ, నోముల లింగుస్వామి, నోముల శివ, నోముల కష్ణా, చిప్పలపల్లి అంజయ్య, చిప్పల పల్లి నర్సింహ్మా తదితరులు పాల్గొన్నారు.