Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతోన్మాద రాజకీయాలతో ప్రజల్లో విద్వేషం నింపుతున్న బీజేపీ
-రెడ్డిబావిలో మేడే జెండావిష్కరణ
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
దేశంలో బీజేపీి మతోన్మాద రాజకీయాలు చేస్తుందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యలు బూర్గు కష్ణారెడ్డి, ఎండి.పాషా అన్నారు. మతోన్మాద మాటలతో ప్రజల్లో విద్వేషాలు నింపుతుందని విమర్శించారు. మండలంలో రెడ్డిబావి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మేడే జెండావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమరశీల పోరాటాలతో సాధించిన కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. యువతలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తూ అశాంతి నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు.దేశంలో,రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతుంటే పాలకులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయోధ్య రామాలయం అంశం ముగిశాక ఇప్పుడు శివలింగం పేరుతో మరోసారి ఉద్రిక్తతలు సష్టించడానికి రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు,మండల కమిటీ సభ్యులు బోయ యాదయ్య,గ్రామశాఖ కార్యదర్శి నందగిరి పరమేష్,మాజీ సర్పంచ్ నందగిరి వసంత, భీమిడి ప్రభాకర్ రెడ్డి, నాయకులు నగేష్, వెంకటేష్, యాదయ్య, జంగయ్య, నరేష్, సందీప్, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.