Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
మన ఊరు-మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమంలో 12 అంశాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనులు జరగాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో ఉదయం నల్గొండ, మధ్యాహ్నం నకిరేకల్ నియోజకవర్గాల కు సంబంధించి మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మడలాల వారీగా స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, సర్పంచ్‌లు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్లు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 517 పాఠశాలలను మొదటి దశలో ఎంపిక చేసి కొన్ని చోట్ల పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో మొత్తం 71 పాఠశాలలను ఎంపిక చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇసుక, సిమెంట్‌ను స్థానికంగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రూ.30 లక్షల లోపు ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని ఆయన తెలిపారు. రాబోయే 15 రోజులపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలలో జరిగే పల్లె ప్రగతి, బడిబాట, మొదలగు కార్యక్రమాల కోసం వస్తారని ఆలోగా పాఠశాలలో మన ఊరు-మన బడి పథకం కింద మౌలిక వసతులను మెరుగుపర్చాలని ముఖ్యంగా నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, మరమ్మతులు చేయడం మొదలగు పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు చేయాలని అధికారులను కోరారు. మధ్యాహ్నం నకిరేకల్ నియోజకవర్గలో ఎంపిక చేసిన 72 పాఠశాలల పనుల గురించి చిట్యాల, కట్టంగూర్, కేతేపల్లి, నకిరేకల్, నార్కెట్‌పల్లి అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రాహుల్ శర్మ, ఆర్డిఓ. జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.