Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పెద్ద అందరిలో దూమపానం పై అవగాహన రావాలని అప్పుడే దూమపానం పూర్తిగా నిషేధం అవుతుందని చిన్న పిల్లలు పొగాకు ఉత్పత్తులు అమ్మిన,. కొన్న నేరమే అని , బహిరంగ ప్రదేశాలలో దూమపానం చేసేవారిని గుర్తించి పోలీస్ వారి సహకారంతో జరిమాణ విధించాలని ఆమె తెలిపారు. జిల్లాను స్మోకింగ్ ఫ్రీ గా మార్చేందుకు అధికారుల కషితో పాటు ప్రజల సహకారం కూడా అవసరం అని అన్నారు. ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి డిసిపి నారాయణ రెడ్డి మాట్లాడుతూ దూమపానం వళ్ళ కలిగే నష్టాల పై అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని , బహిరంగ ప్రదేశంలో దూమపానం చేసేవారి పై జరిమాన విధించే సమయంలో తమ శాఖ సహకారం అందిస్తుందని , విద్య సంస్థలకు 100 గజాల లోపు ఎలాంటి పొగాకు విక్రయాలు జరగకుండా చూస్తామని వారు అన్నారు. ఈ ర్యాలీలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎసిపి వెంకట్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్, జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, జిల్లా విద్య శాఖ అధికారి నర్సింహా, కమిటీ సభ్యులు , స్కిడ్ సొసైటీ ఫర్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ డెవెలప్మెంట్ డైరెక్టర్ నాగరాజు, ప్రాజెక్ట్ మేనేజర్ భాను కుమార్, ఆశ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.