Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరి మండలం లోని అనాజిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి ప్రారంభమైన ఖో ఖో , వాలీబాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం మంగళవారం తో ముగిసినట్లు పి ఈ టి నాతి కష్ణమూర్తి తెలిపారు. మంగళవారం వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్విత రెడ్డి హాజరై, మాట్లాడారు. క్రీడాకారులు కష్టపడి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు మనలో నైపుణ్యం ఉంటే స్పాన్సర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తారు అని అన్నారు.తనకు 30 లక్షల స్పాన్సర్షిప్ దొరికిందనీ, కష్టపడి ఎదగాలనీ కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఎదునూరి ప్రేమలత క్రీడాకారులను ఉద్దేశించి క్రీడలు ఆడడం వల్ల స్నేహభావం పెరుగుతుందనీ, మనకు ఈ పాఠశాలకు పి ఈ టి నాతి కష్ణ మూర్తి రావడం మన అదష్టం అన్నారు , గ్రామ ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో మరింత ఎత్తుకు ఎదిగి ఈ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. క్యాంపు కోచ్,ఇంచార్జ్ లను అభినందించారు కలెక్టర్‌కి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజయ కి గ్రామం తరపున క్యాంపులను కేటాయించి నందుకు కతజ్ఞతలు తెలిపారు. క్యాంపు లో పాల్గొన్న 155 మంది బాలబాలికలకు అల్పాహారం పాలు గుడ్లు అరటిపండ్లు ఎస్ ఆర్ ల్యాబ్ భువనగిరి కొరివిపల్లి వెంకట నరసింహ,మహేష్, సాయి లు అందజేశారు. క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మైలారం వెంకటేష్, గ్రామ సెక్రటరీ మాలేఖ్య, ఎస్ ఎం సి చైర్మన్ కడరి సత్యనారాయణ, పాఠశాల అభివద్ధి కమిటీ సభ్యులు ఏదునూరి మల్లేశం, గునుగుంట్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు పిట్టల వెంకటేశం, మామిడాల శ్రీనివాస్, గోగు శ్రీను, వెలిశాల కష్ణ, నాయకులు బతుక అశోక్ , బొల్లేపల్లి అశోక్ , సీనియర్ క్రీడాకారుడు పల్లె రమేష్ రెడ్డి, గ్రామ యువకులు ఎదునూరి నరేష్,మైలారం శివప్రసాద్, ఏదునూరి సాయి, ముద్రబోయిన కష్ణ,గోగు శ్రీహరి, కోచ్ నాతి కష్ణమూర్తి క్యాంపు ఇంచార్జ్‌లు పిట్టల ఆంజనేయులు, పిట్టల శ్రీశైలం పాల్గొన్నారు.