Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ సాధారణ సమావేశంలో చైర్మెన్
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని , ఏడాదిలోగా నీలగిరి ముఖ చిత్రం పూర్తిగా మారనుందని మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం నీలగిరి మున్సి పాలిటీ పాలకవర్గ సమావేశం చైర్మెన్ అధ్యక్షతన జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలలుగా పట్టణంలో రోడ్ల విస్తరణ , డివైడర్ , సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ , రోడ్డుకు ఇరు వైపులా డ్రెయినేజీ కాల్వల నిర్మాణం పనులు, నేషనల్ హైవే 565 రోడ్డు పనులు ఏక కాలంలో కొనసాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ రోడ్డులో మే 31 నాటికి పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపట్టడం జరు గుతుందని వెల్లడించారు. కోటి రూపాయలతో అర్బన్ పార్కు , వైఎస్సార్ , రాజీవ్ పార్కులను రూ .50 లక్షల చొప్పున కెేటాయిం చినట్లు చెప్పారు. వల్లభరావు చెరువు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిం దని, కళాభారతి, ఉదయ సముద్రం డిజైన్లు త్వరలోనే ఖరారు అవుతా యన్నారు. మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, ఆర్అండ్ అతిథి గృహానికి నిధులు విడుదల చేస్తామని చెప్పిన సీఎంకు పాలకవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వార్డుకు రూ . కోటి కేటాయించాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మంత్రి కేటీఆర్నఉ కోరగా సానుకూలంగా స్పదించారని, త్వరలోనే నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు తిరిగి నల్లగొండకే వస్తున్నారని, ఇండ్లకు డబులు నెంబర్లు , బై నెంబర్లు ఇచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులకు అస్సలు భయంలేదని, తాగు నీటిపై దృష్టి సారించాలని, పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జరుగకుండా చూడాలని కమిషనరు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ ఖయ్యుంబేగ్ మాట్లాడుతూ మజీదుల వద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు ఉద్యోగులకు ఫోన్లు చేసినా స్పదించడంలే దని, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ డబ్ల్యుస్ ప్లాంట్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిట్టర్లు క్షేత్ర స్థాయిలో తిరగకపోవడం వల్ల నీటి ఇబ్బందులు వస్తున్నాయని , వారిపై పర్యవేక్షణ పెట్టాలని అధికారులకు సూచించారు . కో ఆప్షన్ సభ్యుడు కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులకు సులభ తరంగా ఉండేలా ఏజెన్సీలను ఎంపిక చేయాలని కోరారు. కౌన్సిలర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె .రమణాచారి సమాధానాలు చెప్పారు. అనంతరం అజెండాను ఆమోదిస్తున్నట్లు చెర్మెన్ సైదిరెడ్డి ప్రకటించారు. వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ గాడ్, ఏసీపీ నాగిరెడ్డి , డిఈలు నరసింహారెడ్డి, అశోక్, వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తుజా అలీ , సుర్విశంకర్, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.