Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైంగిక దాడులపై ధైర్యంగా ఫిిర్యాదు చేయండి
- ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
మహిళా భరోసా సెంటర్స్ ఏర్పాటు దేశానికే ఆదర్శమని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జరిగిన భరోసా సెంటర్ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం లో పాల్గొని మాట్లాడారు. వేధిం పులు, హత్యాచారం, నిరాదరణకు గురైన బాధిత మహిళలకు, పిల్లలకు ఒకే చోట మెడికల్, న్యాయసలహా, వైద్యం, కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర పోలీసు, మహిళ అండ్ చెల్డ్ వెల్ఫేర్ అధ్వర్యంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. లైంగిక దాడులు జరిగితే ధైర్యంగా ఫిిర్యాదు చేయాలని తెలిపారు. హత్యాచారం, బాలలపై లైంగిక వేధింపులు, దాడులు లాంటి కేసులు నమోదౌతే భరోసాకు పంపించాలన్నారు. కేసు ముగిసే వరకు సపోర్ట్ పరసన్, లీగల్ అడ్వైసర్ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. భరోసా సెంటర్ రాష్ట్ర టెక్నికల్ డైరెక్టర్ మమత రఘువీర్ మాట్లాడుతూ సెంటర్, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయా లని, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడులను నివారిం చాలని అన్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులు, కోర్టులతో సమన్వయంగా పని చేస్తున్నాము అన్నారు. మహిళ రక్షణ భద్రతలో బాగంగా రాష్ట్ర పోలీసు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పని చేస్తుంది అన్నారు. స్థానిక హాస్పటల్ సహాయంతో ఇన్ పేషెంట్ విభాగంను ఏర్పాటు చేసి సేవలు అంది స్తామన్నారు. ఈ సమావేశంలో అధనపు ఎస్పీ మనోహర్, అశోక్, డీఎస్పీలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరావు, మొగిలయ్య, చైర్పర్సన్ కృష్ణ, ఐసీడీఎస్ సుభద్ర, డీఎల్ఎస్ఏ వేణు పాల్గొన్నారు.