Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ప్రతినెలా నిధులను ఇస్తుంది
- విలేకర్ల సమావేశంలో జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కొందరు సర్పంచ్‌లు నిరాధారణమైన ఆరోప ణలతో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, అది సరైంది కాదని, సమస్య ఉంటే అధికారులతో మాట్లాడి పరిష్కరించుకో వాలని, ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడే సర్పంచ్‌పై పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 6 మాసాలకు ఒక సారి నిధులు ఇచ్చేవని, కేసీఆర్ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీలకు ప్రతినెలా నిధులు ఇస్తున్నార న్నారు. సర్పంచ్‌లు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరైంది కాదన్నారు. కొందరు కావాలనే డబ్బులు రాలేదని మండల పరిషత్‌లో మెమోరండాలు ఇవ్వడం, బహిష్కరి స్తామనడం సరికాదన్నారు. మునుగోడులో బిక్షాటన చేసిన సర్పంచ్ 40 లక్షల పెండింగ్ బిల్లులు రావాలని చెప్పాడు. డీపీఓ ఆధ్వర్యంలో అధికారులు వెల్లి వరిశీలించగా రెండు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, అక్కడ 3 లక్షలు మాత్రమే పెండింగ్ ఉందని పేర్కొన్నారు. తిరుగండ్ల పల్లి సర్పంచ్ కూడా పుస్తెలలాడు అమ్మి పనులు చేశానని చెప్పాడని, సీసీరోడ్డు పనులు మార్చిలోనే బిల్లు పెట్టాడని, వెంటనే ఎలా వస్తుందని ప్రశ్నించారు. కొన్ని బిల్లులు మేలో పెట్టారవి ఇంకా పాస్ కాలేదని తెలిపారు. చాలా గ్రామపంచా యతీల్లో ప్రతినెలా వచ్చే నిధులు వేతనాలు పోను మిగులుతున్నాయని తెలిపారు. పులిచెర్లలో 19 లక్షలు రావాలని చెప్పారని, వారికి వచ్చేది 9 లక్షలే అని, వాటికి కూడా బిల్లులు పెట్టలేదన్నారు. నిజంగా ఎంబీ రికార్డులు చేసి బిల్లులు పెట్టినా రాని వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.