Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జిల్లాలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. బుధవారం జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మా ట్లాడుతూ జిల్లా కేంద్రంలో అనేక ప్రయివేటు ఆస్పత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగరం దూరంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు లేకపోవడం వల్ల ప్రయివేటు ఆసుపత్రులను ప్రజలు ఆశ్రయిస్తున్న ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులు ఎలాంటి మెరుగైన వైద్య సేవలు ఇవ్వకుండా విపరీతమైన ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, అనుభవం లేని డాక్టర్లతో జనాలకు వైద్యం చేయిస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నారు అని వారన్నారు ఈ మధ్య కాలంలో జరిగిన జిల్లా కేంద్రంలో గల శ్రీస్వాతి ఆసుపత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా జిల్లా కేంద్రంలో కొలువైన ప్రయివేటు ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని దీనిపై జిల్లా వైద్య అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని వారు అన్నారు వెంటనే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించి గుర్తింపులేని ఆసుపత్రులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు వీరితోపాటు జిల్లా కోశాధికారి ఎదునూరి వెంకటేష్, జిల్లా కమిటి ఎండి సలీం,బండారు శ్రవణ్,పగడాల.శివ పాల్గొన్నారు.