Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దు
- కాదంటే ఫాం హౌస్ ను ముట్టడిస్తాం
- కాంగ్రెస్ ఆలేరు నేత కల్లూరి రామచంద్రారెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట నుండి ఎర్రవెల్లి లోని సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌కు గతంలో అలైన్మెంట్ చేసి 66 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం ఇల్లు కూల్చి వేసి ఇప్పుడు మూల మలుపులను తొలగించి రోడ్డు సీదాగా ఉండేలా చేస్తూన్నామని పేర్కొనడం దారుణమని ఆలేరు కాంగ్రెస్ నేత కల్లూరి రామచంద్రారెడ్డి విమర్శించారు.ఇండ్ల ముందుకు వచ్చేలా దౌర్జన్యంగా రోడ్డు పనులు చేపట్టడంతో తాము తీవ్రంగా నష్టపోతామని ప్రజలు ఈ సందర్భంగా పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దత్తతా గ్రామం వాసాలమర్రి పునర్నిర్మాణం ఎన్నికల్లోపు పూర్తి చేయాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కోసం వేస్తున్న రోడ్డు విస్తరణలో ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని కల్లూరి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దత్తతా గ్రామం వాసాలమర్రి తో పాటు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దత్తతా గ్రామమైన కొండాపూర్ గ్రామాల్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై మంగళవారం అక్కడి స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వం, అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొండాపూర్, వాసాలమర్రి వయా తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్ట వరకు ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి సరైన పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా అలైన్ మెంట్ ప్రకారమే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దత్తతా గ్రామం వాసాలమర్రి గ్రామ పెద్దలు, యువకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలో మ్యాన్యువల్ రికార్డులో ఇంటి వివరాలు ఉండి ఆన్ లైన్ లో ఉండకపోవడం మోసగింపు చర్యలను ప్రభుత్వంపై ఆయన విరుచుపడ్డారు. సుమారు వంద ఇళ్లను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని కొత్త లే అవుట్ తో ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. విస్తరణలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఇంటి స్థలం, భూమిని కేటాయించాలని ఆయన కోరారు. గ్రామస్తుల డిమాండ్ మేరకు వచ్చే ఎన్నికల్లోపే గ్రామ పునర్నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో ఆయా గ్రామాల నిర్వాసితులతో కలిసి సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎరుకల వెంకటేష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు ఓర్సు భిక్షపతి, నల్ల బాలక్రిష్ణ, యాదగిరి, వెంకట స్వామి, వాసలమర్రి, కొండాపూర్ గ్రామస్థులు ఉన్నారు.