Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బొల్లంమల్లయ్యయాదవ్ అన్నారు.మంగళవారం మండలకేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో రూ.1.25కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పనులను ప్రారంభించి మాట్లాడారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందన్నారు.నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సదుపాయాలు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని స్థాపించారన్నారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కొండ సైదయ్య,స్వాతంత్య్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎస్కె.జానిమియా, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ సురేష్, ఎంఈఓ సలీం,షరీఫ్, గ్రామసర్పంచ్ కోడారు వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ బెల్లంకొండ రమణ నాగయ్య, ప్రధానోపాధ్యాయులు దస్తగిరి పాల్గొన్నారు.