Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
చందుపట్ల పీఏసీఎస్ బ్యాంకు నూతన చైర్మన్గా ఎలిమినేటి మల్లారెడ్డి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుపట్ల బ్యాంకులు ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. సిబ్బంది కూడా విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు బల్గురి మధుసూదన్ రెడ్డి, సుబ్బురు మహేందర్, పల్లెర్ల స్వామి, తోటకూరి శంకరయ్య, చింతల వెంకటరెడ్డి, బూరుగు సౌజన్య లక్ష్మారెడ్డి, భువనగిరి అబ్బయ్య, అంగడి బాలమ్మ పాల్గొన్నారు.
బ్యాంక్ చైర్మెన్ మంది లక్ష్మీ నరసింహ రెడ్డి పై బహిష్కరణ వేటు
మండలంలోని చందుపట్ల గ్రామంలో గల పీఏసీఎస్ఎస్ బ్యాంకు లో అవినీతి అక్రమాలు జరిగాయని డైరెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ విచారణ జరపగా ఈ విచారణలో అవినీతి అక్రమాలు జరిగాయని తేలినట్లు నివేదిక పై అధికారులకు సమర్పించారు. సంఘం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇప్పుడు సంబంధిత డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా విధంగా వ్యవహరించడం ,విధులను సక్రమంగా నిర్వహించడం పై అభియోగం కూడా పరిశీలించి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మందడి లక్ష్మీ నరసింహ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీఓ పరిమాల్ల దేవి ఉత్తర్వులు జారీ చేశారు.