Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలోని సిద్ధి సముద్రం తండాకు చెందిన గిరిజన యువకుడు ధరావత్ సాయిప్రకాష్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 ఫలితాలలో 650 ర్యాంకు సాధించి సత్తాచాటారు.సాయి ప్రకాష్ తండ్రి ధరావత్ రవీందర్ సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుండి సాయిప్రకాష్ చదువుతో పాటు ఆటల్లో ముందుండే వాడన్నారు. ఇంటర్ పూర్తి కాగానే ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్‌సర్వీస్ కోచింగ్ తీసుకున్నాడని చెప్పారు.నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన సాయిప్రకాష్ ఎంతో కష్టపడి చదివి ఐపీఎస్‌గా ఎంపిక కావడం తమ గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ రవీందర్‌నాయక్ అన్నారు. సాయిప్రకాష్ సివిల్‌లో ఉత్తమర్యాంకు సాధించడం పట్ల సిద్ధిసముద్రంతండాలో గ్రామస్తులు,బంధువులు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్‌నాయక్, మొండి చింతతండా సర్పంచ్ మోహన్‌బాబు, వెంకన్న, సోములు, చెన్నా, ఉపేందర్, రాధిక, మహేష్ పాల్గొన్నారు.