Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మార్క్సిస్టు మహౌపాద్యాయులు (కారల్ మార్క్స్, ఎంగెల్స్,లెనిన్,స్టాలిన్, మావో ) ప్రపంచ మానవ వికాసానికి మార్గదర్శకులని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం వైఎస్ ఆర్ గార్డెన్ ఆవరణలో పీ వై ఎల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు జరిగాయి . పీ వై ఎల్ రాష్ట్ర కోశాధికారి అధ్యక్షతన మార్క్సిస్టు మహో పాధ్యా యుల జీవిత చరిత్ర పై క్లాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా డేవిడ్ కుమార్ మాట్లాడుతూ దోపిడీ,పీడన లేని సమాజం కోసం,వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం,పెట్టుబడి దారి విధానాన్ని కూలదోసి శాస్త్రీయ దక్పథం, సమాజ నిర్మాణమే లక్ష్యంగా మార్క్సిస్టు మహోపాధ్యాయులు కషి చేశారని కొని యాడారు.ఈ కార్యక్ర మంలో పీ వై ఎల్ రాష్ట్ర అధ్యక్షులు దేసెట్టి సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్,రాష్ట్ర నాయకులు కోలా లక్ష్మీనారాయణ, పర్శక రవి, దరావత్ రవి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సంఘాల నాయకులు ఎస్ యాకుబ్, పీ ఓ డ బ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత,సరిత, గుండు బిక్షపతి, తమ్మడి అంజయ్య, బాలకష్ణ, వగ్గు మల్లయ్య, బర్మ బాబు,పాకాల నరేష్, పి.సుదర్శన్,చారి తదితరులు పాల్గొన్నారు.