Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణస్థలాన్ని పరిశీలించిన న్యాయమూర్తులు
నవతెలంగాణ-రామన్నపేట
మండల కేంద్రంలోని కొమ్మాయి గూడెం రోడ్డులో నిర్మించనున్న జూనియర్ సివిల్కోర్టు, అదనపు కోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన మంజూరు ధ్రువపత్రాలను న్యాయమూర్తులు ఎం అర్జున్, కలిదిండి తులసి దుర్గా రాణి మంగళవారం స్థానిక తహసీల్దార్ అంజనేయులుకు అందజేశారు. అంతకుముందు కోర్టు భవనాల నిర్మాణానికి రెవెన్యూ అధికారులు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని జడ్జిలు పరిశీలించారు. ఈ స్థలంలో కోర్టు భవన నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ దీనికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జినుకల ప్రభాకర్, నకిరేకంటి మొగులయ్య, సీనియర్ న్యాయవాదులు బొడిగె లక్ష్మయ్య, ఉయ్యాల హనుమంతు గౌడు, మజీద్, బర్ల డేవిడ్, దినేష్ కుమార్, యాదాసు యాదయ్య, గాలి లింగయ్య, మామిడి వెంకటరెడ్డి, నోముల స్వామి తదితరులు పాల్గొన్నారు.