Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
అంగన్వాడీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని సర్వేల్ గ్రామంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సెక్టార్స మావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలను వర్కర్స్ గా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పెన్షన్ గ్రాట్యుటీ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డి ఎ డి ఎ కూరగాయల కరెంటు బిల్లు ల వంటివి విడుదల చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాలు అన్నింటికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్నారు సెంటర్ నిర్వహణకు ప్రతి ఏడు రూ 2500 విడుదల చేయాలన్నారు. ఈ సమావేశం లో అంగన్వాడి కేంద్రం టీచర్స్ ఏ.సావిత్రి, డి వనజ, ఎం వెంకటమ్మ, జి. రణమ్మ, ఎస్ పుష్పలత, ప్రేమలత ,మాధవి, కతల శైలజ తదితరులు ఉన్నారు.