Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
పల్లెప్రగతి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పలువురు సర్పంచులు కోరారు.మంగళవారం ఈనెల నెల 3వ తారీకు నుంచి 18వ తారీకు వరకు జరగాల్సిన 5వ విడత పల్లెప్రగతి దినచర్యపై మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు,స్పెషల్ అధికారులతో ఎంపీపీ గోపాల్‌నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచులు మాట్లా డుతూ బిల్లులు సకాలంలో పడక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నామని వాపోయారు.అందరూ సర్పంచులు మండల విద్యుత్ అధికార యంత్రాంగం తీరుపై అసంతప్తి వ్యక్తం చేశారు.విద్యుత్ శాఖ పరంగా ఎలాంటి సహాయం అందకపోగా అధిక బిల్లులు మోపుతున్నారని ఆరోపించారు.పై సమస్యపై మాట్లాడిన ఎంపీపీ గోపాల్‌నాయక్ సర్పంచుల పక్షాన నిధులు వెంటనే విడుదల చేసి సర్పంచులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొత్తగా ఏర్పడిన పాలకవీడు మండలంలో సిబ్బంది కొరత ఇబ్బందికరంగా ఉందన్నారు.జిల్లా యంత్రాంగం సిబ్బందిని భర్తీ చేసే విషయంపై దృష్టి సారించాలని కోరారు.5వ విడత పల్లెప్రగతి కార్యక్రమం అందరి అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తు విజయవంతం చేయాలని తహసీల్దార్ శ్రీదేవి సర్పంచులకు సూచించారు. బిల్లుల ఆలస్యంపై స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి సర్పంచులకు సర్ది చెప్పి పల్లెప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు..