Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నల్లగొండ: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు.బుధవారం పేదలందరికీ ఇండ్లు, స్థలాలివ్వాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందుధర్నాకు వెళ్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు హనుమకొండ జిల్లా నాయకత్వాన్ని పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గుడిసెవాసుల విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు.వారికి ఇండ్లు,స్థలాలు వచ్చే వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు.అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.ఇండ్ల స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వం రూ.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.వరంగల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండ్ల స్థలాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగునాగార్జున, చినపాకలక్ష్మీనారాయణ, ప్రభావతి, నర్సిరెడ్డి, దండెంపల్లిసత్తయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు సరికాదు
సూర్యాపేటటౌన్ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ లను వరంగల్ లో అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.పట్టణంలో నాయకుల అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పేదలు వేసుకున్న గుడిసెలను సందర్శించాలని వస్తే ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, దండా వెంకటరెడ్డి,ఎల్గూరి గోవింద్,కొప్పుల రజిత, మద్దెల జ్యోతి,మేకనబోయిన సైదమ్మ,మేకనబోయిన శేఖర్,చినపంగి నర్సయ్య, జిల్లా నాయకులు మందడి రాంరెడ్డి, నంద్యాల కేశవరెడ్డి, గట్టుపల్లి సత్తిరెడ్డి,నారాయణ, వీరారెడ్డి, గోపిరెడ్డి దామోదర్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నల్లమేకలఅంజయ్య, మామిడి సుందరయ్య, సాయికుమార్ పాల్గొన్నారు.