Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతనకల్ : మండల పరిధిలోని చిల్పకుంట్లలో నేడు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు పోలేపాక నగేష్ పిలుపునిచ్చారు.బుధవారం మండలకేంద్రంలో విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఖాశీం, నటుడు,నిర్మాత, దర్శ కుడు ఆర్.నారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్‌బాబు హాజరు కానున్నటు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందాల శంకర్‌రెడ్డి,కందాల కష్ణారెడ్డి,కేవీపీఎస్ నాయకులు బొజ్జ శ్రీనివాస్, నాయకులు గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, ముండ్ల సంజీవ, కూసుసైదులు పాల్గొన్నారు.