Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాభదాయక పంటల వైపు దష్టి సారించాలి
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
- రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వసంకల్పం
- విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి ముందస్తు ప్రణాళికతో రాష్ట్రంలో వ్యవసాయరంగానికి అందించిన ఊతం మూలంగా దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.వానాకాలం సాగు పై బుధవారం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన రైతుల అవగాహన సదస్సులో ఆయన సహచర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 60 శాతం జనాభా ఆధారపడి ఉన్నా వ్యవసాయ రంగం అభివద్ధి సాధిస్తే మిగతా అన్ని రంగాల్లో అభివద్ధి సాధ్యమేనని అన్నారు. అత్యధిక మందికి ఉపాధి ఇచ్చే వ్యవసాయరంగం సుస్థిరం కోసం పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని, రైతు వేదికలలో సంవత్సరం పొడవునా రైతులకు లాభసాటి వ్యవసాయం పై శిక్షణ తర్వాత నిర్వహిస్తామని వీటిలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని అన్నారు. పంట పొలాలను నాశనం చేస్తున్న కోతుల విషయాన్ని ప్రస్తావిస్తూ కోతులు కేవలం పంట పొలాలను మాత్రమే నాశనం చేస్తున్నాయని వాటిలో పరకాయ ప్రవేశం చేసిన రాజకీయ కోతులు మొత్తంగా వ్యవసాయ రంగాన్నే నాశనం చేస్తున్నాయంటూ దుయ్యబట్టారు.దానికి కొనసాగింపుగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఆ రాజకీయ కోతుల మూక మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే ఉద్బవించిందంటూ కాంగ్రెస్ నేతల పై పరోక్ష విమర్శలు గుప్పించారు.రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించేది అందుకోసమే నని ఆయన స్పష్టం చేశారు. లాభదాయక పంటల వైపు రైతులు దష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి,రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి,జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్‌రావు,రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి సభ్యులు ఎంసీ.కోటిరెడ్డి,రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకష్ణారెడ్డి, శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి,యన్.భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య,రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడిసైదిరెడ్డి, నల్లగొండ, భోనగిరి, సూర్యాపేట రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్,రజాక్, అమరెందర్ గౌడ్,సూర్యాపేట, నల్లగొండ, భోనగిరి యాదాద్రి జిల్లాల కలెక్టర్లు వినరుకృష్ణారెడ్డి, ప్రశాంత్‌జీవన్‌పాటిల్, పమేలా సత్పతి పాల్గొన్నారు.