Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సవత్సరం చేపట్ట బోయే జనగణనలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ కులాల జనగణన చేపట్టాలని జనగణనపై జాతీయస్థాయిలో ప్రధాని మోడీ నేతత్వంలో అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీల అభిప్రాయం కోరాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండలకేంద్రంలో ఒక ప్రయివేట్ కార్యక్రమానికి హాజరయ్యారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 1931 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కులాల వారీగా జనగణన నిర్వహిస్తే నేటి వరకు కేంద్ర ప్రభుత్వాలు లెక్కలు తీయడం లేదన్నారు.2011లో అప్పటి యూపిఏ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీసిన నేటి వరకు వాటిని ప్రకటించ లేదన్నారు.ఇప్పటికే కులగణన చేపట్టాలని తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,బీహార్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానం చేశారని,దేశంలో 22 రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటిస్తూ ప్రధాని మోడీకి లేఖలు కుడా వ్రాశారని గుర్తు చేశారు.దేశంలో కుక్కలకు,నక్కలకు లెక్కలున్నాయి కానీ బీసీలకు లేకపోవడం దారుణమన్నారు.జంతువులకు ఉన్న విలువ బీసీలకు లేదన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్,జిల్లా కార్యదర్శి భూపతి నరేష్‌గౌడ్, బంటు వెంకటేశ్వర్లు, జయమ్మ, చేగొండి మురళియాదవ్, సావిత్రి, దాసరాజు జయరాజ్, కవిత, ఎర్రయ్య పాల్గొన్నారు.