Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.15 లక్షల విలువచేసే 24 బైకులు స్వాధీనం
నవతెలంగాణ-మిర్యాలగూడ
అంతర్ జిల్లాల బైక్దొంగను మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.దొంగతనాల వివరాలను జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి బుధవారం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు.సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెం గ్రామానికి చెందిన వేమూరి కష్ణ అలియాస్ చేకూరి శ్రీకాంత్ చౌదరి చిన్నప్పటినుండి దొంగతనాలకు పాల్పడుతున్నాడు.పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు.గత సంవత్సరం సెప్టెంబర్ 22న ఖమ్మం జిల్లా జైలు నుండి విడుదలైన కష్ణ మిర్యాల గూడటౌన్, మిర్యాల గూడ రూరల్, సూర్యాపేట టౌన్, ఖమ్మం టౌన్ పరిధిలో రోడ్లపై పార్క్ చేసిన వాహనాలలో హ్యాండిల్ లాక్ చేయకుండా ఉన్న వాహనాలను గుర్తించి తన దగ్గర ఉన్న తాళంతో బైక్లలను దొంగతనం చేస్తున్నాడు.బుధవారం తెల్లవారుజామున టూ టౌన్ పోలీసులు హనుమాన్ పేట ఫ్లైఓవర్ కింద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా బైకు దొంగతనం వివరాలు వెలుగులోకి వచ్చాయి.మిర్యాలగూడ టూ టౌన్లో ఐదు కేసులు, వన్‌టౌన్‌లో నాలుగు కేసులు,రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సూర్యాపేట టౌన్ స్టేషన్ లో ఐదు కేసులు ఖమ్మం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 8 కేసులు ఇతనిపై నమోదై ఉన్నాయి.ఇతని వద్ద 15 లక్షలు విలువ చేసే 24 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.ఈ సమావేశంలో డీఎస్పీ వై వెంకటేశ్వరరావు సీఐ నిగిడాల సురేష్, ఎస్సై సుధీర్‌కుమార్,ఆర్ఎస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు కొమ్ము రవి, ఎస్.వెంకటేశ్వర్లు,ఎం.రామకష్ణ పాల్గొన్నారు.