Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ సారస్వత పరిషత్ సూర్యాపేట జిల్లా కన్వీనర్‌గా మనం వికాసవేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేశ్ నియమితులయ్యారు.హైదరాబాద్ బొగ్గులకుంట తెలంగాణ సారస్వత పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పరిషత్ కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య గణేష్‌కు నియామకపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట సమగ్ర చరిత్ర గ్రంథ సంకలనాన్ని పెద్దిరెడ్డి గణేశ్ ఆధ్వర్యంలో త్వరలో తీసుకురానున్నామని తెలిపారు.రాష్ట్రంలోని 33 జిల్లాల చరిత్రను సారస్వత పరిషత్ పుస్తక రూపంలో తీసుకురానున్నదని, అందులో భాగంగా సూర్యాపేట జిల్లా చరిత్ర రచనకు గణేశ్ ఆధ్వర్యంలో త్వరలో ఒక కమిటీ ఏర్పాటు చేసి రచనా ప్రక్రియను ప్రారంభించనున్నామని వివరించారు.ఈ సందర్భంగా గణేశ్‌ను తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ కార్యదర్శి మామిడి హరికష్ణ ప్రత్యేకంగా సన్మానించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ డా.కె.రామదాస్, ఫిల్మ్ సెన్మార్ బోర్డు సభ్యులు, రచయిత చిలువేరు రఘురాం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.