Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్‌నాయక్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైద్యాధికారులు మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు అమర్‌సింగ్ అన్నారు.సూర్యాపేట పర్యటనలో భాగంగా తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, ఆశాకార్యకర్తలు, మలేరియా నియంత్రణకు అదేవిధంగా జాతీయ కీటకజనిత వ్యాధుల నివారణ కోసం నిరంతరం పని చేస్తూనే ఉండాలని కోరారు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా తీవ్రంగా కష్టపడుతున్నారన్నారు.వారందరి సమిష్టి కషి ఫలితమే దేశస్థాయిలో రాష్ట్రానికి మలేరియా నియంత్రణ కార్యక్రమంలో అవార్డు దక్కిందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశాల మేరకు వ్యాధులు రాకముందే వాటిని నివారించడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా గ్రామీణ స్థాయిలో ప్రజలందరికీ ఆరోగ్య విద్య అందించే విషయంలో సూపర్వైజర్లు అందరూ కషి చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని జాతీయ వైద్య ఆరోగ్య కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రగతి మంచిగా ఉన్నదని ఇంకా కష్టపడి పనిచేసి రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో ఉండే విధంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలను సిబ్బంది అంతా తూచా తప్పకుండా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అడిషనల్ డైరెక్టర్‌ను గజమాలతో సన్మానించడంతో పాటు మెమెంటోను బహూ కరించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మలేరియా, ఫైలేరియా నియంత్రణ కార్యక్రమంలో పాల్గొంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి సంబంధించిన పలు సమస్యలను అడిషనల్ డైరెక్టర్ దష్టికి తీసుకొచ్చారు.సిబ్బంది సమస్యల పరిష్కారానికి తాను అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ కోటాచలం, జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి సాహితి, తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జయ శ్యాంసుందర్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాజియా, సబ్ యూనిట్ అధికారి నరసయ్య ,యూనియన్ జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు, డెమో అంజయ్యగౌడ్, డివిజన్ అధ్యక్షుల వాంకుడోత్వెంకన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా కన్వీనర్ కొంపెల్లి మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ ప్రసవం సంఖ్య పెంచాలి
నేరేడుచర్ల :ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసూతీలు జరిగేలా,సాధారణ కాన్పుల సంఖ్య పెంచేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ అన్నారు. ప్రాథమికఆరోగ్య కేంద్రంనేరేడుచర్ల బుధవారం సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాబోయే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఎవరికి వారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు కలిగించే జీవుల పట్ల అప్రమత్తతో ఉండడంవల్ల ఆరోగ్యంతోపాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చన్నారు.డ్రయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం కోసం మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో పాటు రెవెన్యూ ఆయా గ్రామ పంచాయతీల సిబ్బంది సహకారంతో వారితో కలిసి సమన్వయంగా పనిచే చేయించాలన్నారు.ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఆరోగ్య కేంద్రాల సిబ్బందిదేనని అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.కుటుంబనియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, వాటిని అనుసరించేలా ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎం హెచ్ఓ కోటాచలం, డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, జిల్లా మలేరియా అధికారి సాహితి,డీఎస్ఓ నజీర, ఆరోగ్య కేంద్రం వైద్యులు నాగయ్య, ధర్మతేజ, సూపర్వైజర్లు శ్యాంసుందర్,జయమ్మ,హెల్త్ అసిస్టెంట్లు నర్సయ్య, ఏఎన్ఎంలు,ఆశావర్కర్స్ పాల్గొన్నారు.