Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నకిరేకల్
గ్రామాల సర్వతోముకాభివద్దికి ప్రభుత్వం కషి చేస్తుందని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు బుధవారం మండలంలోని తాటి కల్ గ్రామంలో రూ 20 లక్షలతో సిసి రోడ్లు, రూ.2.72 కోట్లతో బ్రిడ్జి, కల్వర్ట్, కాలువ పునరుద్ధరణ పనులు, ఆ నలుగురు మినీ స్టేడియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. రాష్టంలో సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, బీజేపీ,కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సీఎం కేసీిఆర్ కు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మున్సిపాలిటీ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బంటు రవి, చనగాని జానయ్య తదితరులు పాల్గొన్నారు.