Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణకేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్ ఆవరణలో జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివద్ది సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గస్థాయి దళిత బంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తదితరలు లబ్దిదారులకు అందించిన ట్రాక్టర్లను స్వయంగా డ్రైవింగ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, సమస్త తెలంగాణను అభివద్ది చేస్తున్నందున దళితులను కూడా ఆర్థిక బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దళిత బంధు పథకంను తీసుకువచ్చారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. అదే విధంగా అంబేద్కర్ కల సాకారం కావాలంటే దళిత కుటుంబాలు బాగు పడాలంటే విద్య ద్వారనే సాధ్యం అన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ, దళిత బంధు పథకంలో ఎంపికైన కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆకాక్షించారు. ఈ పథకంలో భాగంగా ఎంపికైన యూనిట్ల వారీగా ప్రగతి సాధించి ఆదర్శంగా నిలవాలని ఆయన లబ్దిదారులను కోరారు. వాహనాలు అందించిన వారికి 15 రోజులలోగా లైసెన్సు పొందే విధంగా ఆర్.డి.ఓ., ఎం.పి.డి.ఓ.లు చర్యలు తీసుకుని ఆర్.టి.ఓ. ద్వారా మంజూరు చేయించాలని తెలిపారు. అదే విధంగా ఎంపీడీఓలు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు మొదలగుని చేయించే పూర్తి బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇచ్చిన వాహనాలను అమ్మడం లాంటివి చేయకూడదని లబ్దిదారులను కోరారు. వాహనాలు కాకుండా ఇతర యూనిట్లకు ఎంపికైన వారు కూడా సమిష్టిగా కష్టపడి పథకం ఫలాలు పొందాలని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా రవాణాకు సంబంధించిన 24 ట్రాక్టర్లు, 3 డోజర్లు, ఆటో ట్రాలీలు 8, 10 కార్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఇతర యూనిట్లైన 5 మిని డైరీ ఫామ్ లు, 9 కోళ్ల ఫారమ్ లు, 1 మేకల పెంపకం, 4 క్యాటరింగ్ సర్వీసులు, 1 భవన నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి, 1 ఆయిల్ మరియు ఫ్లోర్ మిల్లు, 3 మిని సూపర్ బజార్లు, 2 ఎలక్ట్రికల్, 1 ఫర్టిలైజర్ అండ్ ఫెస్టీసైడ్స్, 1 హార్డువేర్ షాప్, 2 డీటీపీ సెంటర్లు, 1 డయాగస్టిక్ సెంటర్, 3 టెంట్ హౌస్, 1 సిమెంట్ షాప్, 1 ఆఫ్టికల్ షాప్, 3 క్లాత్ ఎంపోరియం, 1 పేపర్ ప్లేట్స్ యూనిట్ మొత్తం ట్రాన్సుపోర్టు 40 యూనిట్లు కాగా, నాన్ ట్రాన్సుపోర్టు యూనిట్లు 42 ఉన్నాయని వివరించారు.
నల్లగొండ నియోజకవర్గంలోని కనగల్ మండలం నుండి చెట్లచెన్నారంలో 19 మందికి, నల్లగొండ మండలం నుండి రాములబండలో 17 మందికి, రంగారెడ్డి నగర్ లో 12 మందికి, తిప్పర్తి మండలం నుండి ఎల్లమ్మగూడెం లో 25 మందికి యూనిట్లకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిలు లబ్దిదారులకు అందజేశారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. జగదీశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం, ప్రజా ప్రతినిధులు నాగులవంచ విజయలక్ష్మీ, కరీం పాషా, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర శాసనమండలీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉదయం 8-40 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని ెలిపారు. అనంతరం ఉదయం 9-00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని ,అనంతరం సందేశం వుంటుందని తెలిపారు. అక్కడే ఉదయం 9-30 గంటలకు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారని తెలిపారు.
కవి సమ్మేళనం
సాయంత్రం 6-00 గంటలకు గుండగోని మైసయ్య కన్వెన్షన్ హలులో 'తెలంగాణ స్ఫూర్తి' పై కవి సమ్మేళనం ఉంటుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలలో అధికారులు,ప్రజా ప్రతినిధులు,పుర ప్రముఖులు, పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.