Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే విడుదల చేయాలి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - భువనగిరి
సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ప్రతి అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసి ఇచ్చిన హామీని మర్చిపోయారన్నారు. ఈ సందర్భంలో వరంగల్ లో దాదాపు 25 వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తుంటే పోరాటానికి మద్దతుగా వెళుతున్నా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అక్రమ అరెస్ట్ టీిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు పోరాటంలోకి వస్తున్నారని వారన్నారు. అరెస్టులు చేయడం జైల్లో పెట్టడం సహజమే కావొచ్చు కానీ పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ తమ్మినేని వీరభద్రం అరెస్టును మేధావులు ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటివరకు ఇంతకు ముందు నిర్మించిన నిర్మాణాలు శిథిలావస్థకు చేరి ధ్వంసమవుతున్న పరిస్థితి జిల్లాలో ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు టిఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, మాయ కష్ణ, గడ్డం వెంకటేష్, నాయకులు వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, గందమల్ల మాతయ్య, అంజయ్య, ఎల్లయ్య, రాజేష్, గిరి, కల్లూరి నాగమణి, చింతల శివ, విజరు, నర్సింహ పాల్గొన్నారు.
నల్లగొండ : వరంగల్ లో గుడిసె వాసుల పోరాటంలో పాల్గొని, వారికి మద్దతు తెలియజేయడానికి వెళ్ళుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను రాయపర్తి పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని పాలకులు గుర్తుంచుకోవాలని, ఇండ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అణిచివేత ధోరణి మానుకోవాలని హెచ్చరించారు. ఖండించిన వారిలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, పట్టణ కార్యదర్శి ఎండి.సలీమ్, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ ఉన్నారు.