Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
ఆత్మకూరు (ఎస్) మండలపరిధిలోని ముక్కుడుదేవులపల్లిలో ఏటి నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను రైతులు బుధవారం అడ్డుకున్నారు.ఈ సందర్భంగా రైతులు రౖతులు మందడి రాఘవరెడ్డి, మల్లారెడ్డి, ఇరుగు మల్లయ్య, భిక్షం, మల్లేష్,ఫయాజ్ మాట్లాడుతూ బోరింగ్‌తండాకు చెందిన బిక్కు ట్రాక్టర్ కొంతకాలంగా ఇష్టానుసారంగా ఇసుక తరలించి డంపు చేయడమే కాకుండా పంచాయతీరాజ్ డీఈ మనోహర్ ఇచ్చిన ఇసుక అనుమతి లెటర్‌తో ఇష్టానుసారంగా విక్రయిస్తున్నట్లు ఆరోపించారు.రైతులభూముల్లో భారీ గుంతలు చేసి దౌర్జన్యంగా ఇసుక తరలిస్తున్నారని పోలీస్‌లకు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో ట్రాక్టర్‌ను అడ్డుకున్నామన్నారు.తమపై ట్రాక్టర్ యజమాని బిక్కు అట్రాసిటీ కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు తెెలిపారు.వెంటనే అధికారులు ఇసుక తరలింపును అరికట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.