Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ బొత్తలపాలెం, గుండ్లపహాడ్ గ్రామ పంచాయతీలలో.. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న క్రీడాప్రాంగణాలను.. ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో సందీప్‌రెడ్డి సందర్శించారు. వీటి నిర్మాణంలో కొలతలు, చుట్టూ మొక్కలు నాటడం, మట్టితో చదునుచేయడం, తదితర ఉపాధిహామీ కూలీలు చేస్తున్న పనులపురోగతిని అధికారులు తెలుసు కున్నారు.పంచాయతీ సర్పంచులకు వీటి నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఆర్చులనిర్మాణం, తదితర పనులను వివరించారు.ఈ కార్యక్రమంలో రైతుసమన్వయ సమితి జిల్లా నాయకుడు మల్లివంటి దర్గారావు, బూతులపాలెం గ్రామ సర్పంచ్ రోగాలు వీరారెడ్డి, ఆయా గ్రామాల పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.