Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం
నవతెలంగాణ -నూతనకల్
కుల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఖాసిం, మాజీ శాసన సభా పక్ష నాయకులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు, అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో సుమారు మూడు వేల సంవత్సరముల క్రితమే కుల వివక్షత ఆవిర్భవించిందని నాటి నుండి నేటి వరకు కుల వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు అగ్రకులాల వారు నిమ్న కులాల వారి ని చిన్న చూపు గా చూస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏండ్లు దాటినా మాల మాదిగలను అంటరానివారుగా వివక్ష చూపుతూ ఊరికి దూరంలో వారి నివాసాలను ఏర్పాటు చేసి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు , అంబేద్కర్ వాదులు కమ్యూనిస్టు లేనన్నారు. అంబేద్కర్ సాధన కోసం కమ్యూనిస్టులు పూర్తిగా కషి చేస్తున్నారన్నారు. నాటి నైజాం సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నత సామాజిక వర్గం కుటుంబంలో పుట్టిన భీమిరెడ్డి నరసింహారెడ్డి కుల రహిత సమాజం కోసం అంబేద్కర్ విధానాలను పాటిస్తూ జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి దేశ్ ముఖ్లను ఎదిరించి దళిత బడుగు బలహీన వారికి అండగా ఉంటూ వెట్టిచాకిరికి వ్యతిరేకిస్తూ కుల రహిత సమాజ నిర్మాణం కోసం అంటరానితనాన్ని నిషేధించాలని కషి చేశారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక, రాజకీయ ,సామాజిక సమానత్వ, లౌకికతత్వం, ప్రజాస్వామ్య విధానాలు సాధన కోసం నిరంతరం కమ్యూనిస్టులే కషి చేస్తున్నారన్నారు .అలాంటి కమ్యూనిస్టుల వారసుల గడ్డ అయిన చిల్పకుంట్ల లో అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత కషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగంలో ముందుండి ఉన్నత స్థాయిని చేరుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వివక్షతను నిర్మూలించడం కోసం కషి చేయాలని వారు సూచించారు కెవిపిఎస్ నాయకులు బొజ్జ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభా కార్యక్రమంలో కెేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ,రైతు సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు త ల్లమల్ల హుస్సేన్ ,టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి దున్న శ్యాము కెవిపిఎస్ గ్రామ నాయకులు పోలే పాక నగేష్ ,పిఎన్ఎం జిల్లా నాయకులు పోలేపాక శీను, రైతు సంఘం నాయకులు కందాల శంక్రెరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్తయ్య ,పులుసు ప్రహ్లాద ,అల్లిపురం సంజీవరెడ్డి, గజ్జల శ్రీనివాస్ రెడ్డి ,అన్నారం కష్ణ బొజ్జ విజరు కట్ట సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.