Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కిషోర్‌కుమార్
నవతెలంగాణ -తుంగతుర్తి
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మేరకు గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న డంపింగ్ యార్డ్,పల్లె ప్రకతి వనం, వైకుంఠధామం పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల అభివద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ,మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, స్థానిక సర్పంచ్ మామిడి వెంకన్న ,ఉప సర్పంచ్ పరమేష్ ,ఎం పి టి సి మట్టిపల్లి కవితా కుమార్ మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విద్యాభివద్ధికి పెద్దపీట
కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివద్ధికి పెద్దపీట వేసిందని,విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని పది ఉన్నత పాఠశాలలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 21 లక్షల 50 వేల రూపాయలతో ప్రయోగశాల పరికరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు,మన కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివద్ధికి కషి చేస్తుందని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్, తాసిల్దార్ రామ్ ప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యాకయ్య ,కరుణాకర్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.